కొత్త రైళ్లన్నింటికీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లే!
ఇక కొత్త రైళ్లన్నింటికీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లే!

- భవిష్యత్తు రైళ్లకు ఇదే నమూనా
- విజయవాడ - గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ విజయవంతం
- ప్రయాణికులకు సౌకర్యవంతంగా అధునాతన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
- కొత్త రైళ్లకు ఈ కోచ్‌లనే తీసుకు వస్తామంటున్న దక్షిణ మధ్య రైల్వే
ఆంధ్రజ్యోతి, విజయవాడ: విజయవాడ - గూడూరు మధ్య ప్రవేశపెట్టిన రైలు నెం.12744/12743 ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరాభిమానాలను చవిచూస్తోందని దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఈ సర్వీసును ప్రయాణికులు 85 శాతంకు పైగా ఆదరిస్తున్నారని పేర్కొంది. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు అత్యాధునిక లింక్ హాఫ్‌మెన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను ఉపయోగించటం వల్ల ప్రయాణికులు సౌకర్యవంతంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రైలు విజయవంతం కావటం పట్ల దక్షిణ మధ్య రైల్వే హర్షం వ్యక్తం చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య గురువారం దీనిపై స్పందిస్తూ ప్రజల అంచనాలను అందుకొన్నందుకు సంతృప్తిని వ్యక్తం చేశారు. దీని కోసం కృషి చేసిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
- రాష్ట్ర రాజధాని- సింహాపురి మధ్య నడిచే ఈ రైలు తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, బిట్రగుంట, కావలి, నెల్లూరు స్టేషన్ల ప్రాంతాల ప్రజలకు ఒక వరంగా మారిందని ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బి ) కోచ్‌లను దక్షిణ మధ్య రైల్వే నూతన రైళ్లలో కోచ్‌లుగా ఉపయోగించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. రానున్న రోజుల్లో కొత్త రైళ్లలో ఈ ఎల్‌హెచ్‌బి రేక్‌లనే ఉపయోగిస్తామని అధికారికంగా ప్రకటించింది. విజయవాడ-గూడూరు ఇంటర్‌సిటీ రైలును నూతనంగా ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఉపయోగించామని తెలిపింది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కలిగిన విజయవాడ - గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఆకర్షణీయంగానే కాకుండా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండడం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపింది. యాంటి టెలిస్కోపిక్ (రైలు ప్రమాదం జరిగితే బోగిలు ఒక దానిపై ఒకటి ఎక్కకుండా నియంత్రించే) వ్యవస్థ, అతి తక్కువ బరువు కలిగిన కోచ్‌లు, ఎక్కువ భారాన్ని మోసే సామర్ధ్యం, గంటకు 160 కి.మీ.వేగం, బఫర్ కప్లింగ్ కలిగి ఉంటుందని, ఇవన్నీ ప్రయాణికుల భద్రతాంశాలేనని ప్రకటించింది.
- విజయవాడ - గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో 14 కోచ్‌లున్నాయని, రెండు ఏసి చైర్‌కార్లు, 4 సెకండ్ క్లాస్ రిజర్వుడ్ సీటింగ్ కోచ్‌లు, 8 సాధారణ ప్రయాణికుల కోచ్‌లతో పాటు మొత్తం 1,116 సీట్లు ఉన్నాయని తెలిపింది. ఏసీ చైర్‌కార్‌లో 156 సీట్లు, సెకండ్ సిట్టింగ్ చైర్‌కార్‌లో 432 సీట్లు, సాధారణ సెకండ్ క్లాస్ సిట్టింగ్‌లో 528 సీట్లు ఉంటాయని పేర్కొంది. మెరుగైన సిట్టింగ్ సదుపాయం, విశాలవంతమైన కిటికీలు, వెంటిలేటెడ్ బయో-టాయిలెట్లు, జారడానికి అవకాశం లేని నేల ఈ రైలు లోపలి ప్రత్యేకత లని ప్రకటించింది. నాన్ ఏసి కోచ్‌లలో నీటిని శుభ్రపరిచే వ్యవస్థ గల మంచినీటి వసతి మినీ హాట్-కోల్డ్, ఏసీ చైర్‌కార్‌తో పాటు 3 నాన్ ఏసీ కోచ్‌లు, ఏసీ కోచ్‌లలో రైలు కిటీకిలకు రోలర్ బ్లైండ్లు, స్లైడింగ్ డోర్లు కూడా అమర్చటం జరిగిందని పేర్కొంది. గూడూరు-విజయవాడ మధ్య నడిచే సమయం 4.30 గంటలని, టికెట్ ధర కూడా రోడ్డు ప్రయాణంతో పోలిస్తే తక్కువేనని తెలిపింది. ఈ కారణాల వల్లనే ఈ రైలు ప్రజల మన్నలను పొందుతోందని ప్రకటించింది. ఈ రైలు విజయవాడ డివిజన్‌లో హెచ్ ఆన్ జనరేషన్ (హెచ్‌ఓజి) పవర్‌తో నడిచే మొట్టమొదటి రైలుగా గుర్తింపు పొందిందని పేర్కొంది. దీనిలో రైలు నడవడానికి కావల్సిన విద్యుత్ ఓవర్‌హెడ్ ఎలక్ర్టికల్ వైర్ల నుంచి ఎలక్ర్టిక్ లోకో మోటివ్‌లకు అందుతుందని తెలిపింది. ఈ వ్యవస్థ వల్ల కర్బన వ్యర్థాలను తగ్గిస్తూ పర్యావరణహితం కల్పించటంతో పాటు ఒక రేక్‌కి ఒక ట్రిప్‌కి ఇంధనం ఖర్చు రూ.49.వేల ఆదాతో సంవత్సరానికి రూ.1.79 కోట్లు ఆదా అవుతుందని ప్రకటించింది.

|
|
Comments
Post a Comment