భగవద్గీత -2



భగవద్గీత 



1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ?
జ. మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింప బడినది.
 2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు? జ. గీతలో 700 శ్లోకములు కలవు.
3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ? జ. గీతలో 18 అధ్యాయములు కలవు.
4. ప్రతి అధ్యాయమునకు యివ్వబడిన ప్రత్యేక నామము ఏది?
 జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు.
5. గీత ఎక్కడ, ఎప్పుడు , ఎవరికి చెప్పబడినది?
జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్దారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణపరమాత్మచే చెప్పబడినది.
6. గీత ఎందుకు చెప్పబడినది?
జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది.
7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది? జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది.
8. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి?
 జ. గీత శ్లోకాలు మానవునిలోని శోకాన్నిదూరం చేస్తాయి.
 9. గీత ధృతరాష్ట్రునికి ఎవరు చెప్పారు?
 జ. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను.
10. గీతను ఆసమయంలో ఎందరు విన్నారు?
జ. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయస్వామి

Comments

Popular Posts