తెలుగులో ఆంగ్ల వ్యాకరణ: పఠన గ్రహణము పై పట్టు సాధించడానికి చిట్కాలు(Comprehension – English)

తెలుగులో ఆంగ్ల వ్యాకరణ: పఠన గ్రహణము పై పట్టు సాధించడానికి  చిట్కాలు
జాతీయ స్థాయిలో IBPS, SSC, RRB లాంటిఅనేక పోటీ పరీక్షలన్నింటిలో ఇంగ్లీషు ఒక తప్పనిసరి sectionగాఉంది. ఈ ఇంగ్లీషులో Correction of Errors, Synonyms – Antonyms, Jumbled sentences, Cloze test లాంటి అనేక అంశాల నుండి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అయితే వీటన్నింటిని మించి అభ్యర్ధులకి ఏమాత్రం మింగుడుపడని మరో అంశం Reading Comprehension. దీనినే Comprehension passage అని కూడా అంటాము. ఇవ్వబడిన text ని అర్థం చేసుకొని క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
Comprehend = understand
అంటే ఇవ్వబడిన Passage ని చదివి అర్థంచేసుకొని జవాబులు రాయాల్సి ఉంటుంది.
హై స్కూలు స్థాయినుండి చూస్తున్న ఈ అంశంతో వచ్చిన చిక్కేమిటంటే…..
 స్కూలు స్థాయిలో
  • పారాగ్రాఫు నిడివి (size) చిన్నదిగా
  • ప్రశ్నలు సులభంగా అర్థమయ్యేలా
  • సమయం కూడా సరిపోయినంత లభించడం వల్ల
Reading Comprehension అంశం సులభంగానే అనిపిస్తూ ఉండేది.
కానీ పోటీ పరీక్షల్లో, దీనికి భిన్నంగా
  • Passage నిడివి చాలా పెద్దగా ఉండడం
  • ప్రశ్నలు అర్థం కాకపోవడం, ఆమాటకొస్తే చాలా wordsకి అర్థం తెలియక… ప్రశ్నలూ, Passage రెండూ అర్థం కాకపోవడం
  • వీటన్నింటికి తోడు సమయం అయిపోతుందన్న ఆదుర్దా ….
ఇవన్నీ వెరసి ఇంగ్లీషులో మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది.
పోటీ పరీక్షల్లో కూడా కొన్నింటిలో Moderate (మధ్యస్థంగా) స్థాయి ప్రశ్నలు అడుగుతూండగా P.O. స్థాయి వాటిలో, మరింత లోతుగా (Difficult level) ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ముందుగా మీరు సిద్దమవుతున్న పరీక్ష స్థాయి (level) ఏమిటో అర్థం చేసుకోవడం అవసరం.
ఇంగ్లీషు నవల చదవడం వేరు, RC passage చదవడం వేరు. నవల అనేది ఆనందం కోసం చదువుతాం, RCని information కొరకు చదువుతాము. ఈ information నే సమాధానాలలో రాస్తాము. నవల చదివేటపుడు కాస్త ఏమరుపాటుగా ఉండి ఓ నాలుగు లైన్లు skip చేసినా వచ్చే నష్టమేమీ ఉండదు, కానీ RCలో ఒక్క లైను మిస్ అయినా, అర్థం కాకపోయినా మార్కులు కోల్పోయే ప్రమాదముంది.
RC section రెండు అంశాలలో అభ్యర్థి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తుంది.
  1. Vocabulary
  2. Text ని అర్థం చేసుకోగల సామర్థ్యం.
కొన్ని చిట్కాలు, techniques ఉపయోగించడం ద్వారా కొంత అదనంగా మార్కులు పొందే అవకాశం తప్పకుండా ఉన్నది. అయితే ఇవన్నీ కొంతమటుకు మాత్రమే సాయపడగలవు. మీరు నిజంగా నమ్ముకోవాల్సింది మీ Hard work ని మాత్రమే.
1. IBPS PO పరీక్షల ఇంగ్లీషు స్థాయి IBPS క్లర్క్ స్థాయికి భిన్నంగా ఉంటుంది. PO పరీక్షలో ఇంగ్లీషు విభాగం క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి మీరే పరీక్షకి సిద్ధమవుతున్నారో దాని విధానం(Pattern), సిలబస్, స్థాయి తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. అలాగే PO పరీక్షలో ప్రిలిమ్స్, Mains పరీక్షలుంటాయి. Prelims కేవలం అర్హత స్థాయి పరీక్ష. దీనిలో Section వారీగా Cut off ఉంటుంది.
2. Contentయొక్క Tone ని గుర్తించండి. దీనివల్ల ప్రశ్నలు సులభంగా అర్థమవుతాయి. రచయితది ఆశావాదమా..నిరాశావాదమా…ఆగ్రహమా….వ్యంగ్యమా…..మరొకటా…..గుర్తించండి.
3. ఎక్కువ పారాగ్రాఫులు ఉన్నట్లయితే మొదటి, చివరి పారాలను రెండుసార్లు చదివే ప్రయత్నం చేయండి.
ఈ Text దేనిగురించి అనేవిషయం మొదటి పేరాలో, రచయిత అభిప్రాయమేమిటి అనేది చివరి పారాలో స్పష్టమవుతుంది. ముఖ్యమైన అంశాలు ఈ రెండింటిలోనే ఉండే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ టెక్నిక్ పాటించవచ్చు.
4. Reading Comprehensionలో ఉన్న అనుకూలమైన విషయమేమిటంటే ఈ సెక్షన్ లో మార్కులు పొందడానికి కాస్త వొకాబులరీ, కాస్త తార్కిక పరిజ్ఞానం ఉంటే చాలు. జవాబులు ఎలాగూ పారాగ్రాఫులోనే ఉంటాయి కాబట్టి వెతికి పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
5. ఈ విభాగంలో మనకు పెద్ద శత్రువు Time.
నిరంతరం తరుముతూ ఉండే సమయాన్ని అధిగమించి వేగంగా సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఈ తొందరపాటు వల్లే పొరపాట్లు జరిగే ప్రమాదముంది. ఉదాహరణకి IBPS క్లర్క్ ప్రిలిమ్స్ లో మొత్తం 100 ప్రశ్నలకి 60 నిముషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అంటే సగటున ఒక ప్రశ్నకి 36 సెకన్లు మాత్రమే.
6. ఒకటి కన్నా ఎక్కువ Passageలు solve చేయాల్సి వచ్చినపుడు ముందుగా ఏ Passageని ఎంచుకుంటారు?
Size లో చిన్నగా ఉన్న passageని…అంతే కదా….
మీకు అర్థమయ్యేలా ఉన్న passageని ముందు ప్రయత్నించండి. (ఆర్ధిక అంశాలకి సంబంధించిన passageలు చాలామందికి ఓపట్టాన బుర్రకెక్కవు. వీలయితే దానిని పక్కనబెట్టి మరొక passage తో మొదలు పెట్టవచ్చు.) మీకిష్టమైన టాపిక్ గురించి Passage ఎదురయితే మాత్రం తప్పనిసరిగా దానిని solve చేయండి.
Passage తరువాత క్రిందఇవ్వబడే ప్రశ్నలు కూడా passage లో ఉన్న వరుస క్రమంలోనే ఉండే అవకాశముంది. అంటే మొదటి రెండు ప్రశ్నలు passage లోని ముందుభాగంలో ఉండే అవకాశముంది.
Passage లోని ఫలానా wordకి అర్థం ఏమిటి (Synonym) అని అడిగే అవకాశముంది. అలాంటపుడు చప్పున Options లోకి వెళ్ళిపోకుండా, వీలయింతమటుకు సమాధానం ఊహించే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత జవాబులు చూడాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ సందర్భాల్లో సరైన సమాధానం లభిస్తుంది.
7. మీకు బాగా తెలిసిన ఓ అంశం పై Passage గనక ఇవ్వబడితే, Passageలో లేకపోయినా మీకు తెలిసిన జ్ఞానాన్ని పరీక్షలో apply చేయడం సరికాదు. Passageలో ఇవ్వబడ్డ సమాచారాన్ని మాత్రమే ఉపయోగించడం మంచిది.
8. ఇంగ్లీషు చదివే వేగాన్ని పెంపొందించుకోవడం కూడా అవసరం. ఇది కేవలం ప్రాక్టీసు ద్వారా మాత్రమే వస్తుంది.
9. Focus:
ఇతర విభాగాల గురించి ఖచ్చితంగా చెప్పలేముగానీ, RC కి మాత్రం తప్పనిసరిగా ఏకాగ్రతతోనే ఉండాలి. మీ దృష్టి, ఆలోచన ఏమాత్రం పక్కకి మరలినా text అర్థంకాక మళ్ళీ మొదటినుండి చదవాల్సి వస్తుంది. దీనివల్లమళ్ళీ సమయం వృధా అయ్యి మీ ఆందోళన పెరుగుతుంది.
10. మొదటిసారి చదవడం మొదలు పెట్టినప్పటి నుండే Passage దేని గురించి అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూనే ముందుకు వెళ్తుండాలి.
11. క్లిష్టమైన స్థాయి పరీక్షల్లో క్రింద ఇవ్వబడే నాలుగు ఛాయిస్ లు కూడా మిమ్మల్ని గందరగోళపరిచేలా ఉంటాయని భావించి వాటికి సిద్దపడాలి.
ఉదాహరణకి ఓప్రశ్న క్రింద ABCD అనే నాలుగు option లు ఇచ్చి మళ్ళీ వాటికింద ఈ విధంగా అడగవచ్చు.
(a) Only (A) and (B)
(b) Only (A) and (C)
(c) Only (A)
(d) Only (B)
(e) All (A), (B) and (C)
12. Vocabulary ని మెరుగు పరుచుకోండి: ఇది ఒక్కరోజులో అయ్యేపని కాదని గుర్తుంచుకోండి.
13. మీవద్ద పది నిముషాలు మాత్రమే ఉండి మరో రెండు Passageలు solve చేయాల్సి ఉన్నప్పుడు ఒకదానిని వదిలిపెట్టడమే కరెక్టు (negative marking ఉన్నప్పుడు). రెండూ చేయాలని పూనుకుంటే దేనికీ న్యాయం చేయలేక చతికిలపడటం ఖాయం.
14. ఓ స్థాయికి వచ్చిన తరువాత, వీలయినన్ని ఎక్కువ Passage లు solve చేయడం మంచిది. కేవలం solve చేయడంతోనే అయిపోకుండా Key తీసుకొని ఎక్కడ పొరపాట్లు చేసారు అని గుర్తించి, విశ్లేషించి ఆ తప్పులు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడటం అవసరం.
15. ఇవ్వబడ్డ Text ని ముందుగా చదివి ఆ తరువాతే ప్రశ్నల వైపుకి వెళ్ళడం సాధారంగా అభ్యర్థులందరూ చేసే పని. ఇదొక సాంప్రదాయంగా వస్తున్నది. అయితే సంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల కూడా ఒక్కోసారి మంచి ఫలితాలు సాధించవచ్చు. అంటే ముందుగా ప్రశ్నలు చదివి ఆ తరువాత Text వైపుకి వెళ్ళవచ్చు. దీనివల్ల text లో దేనికోసం వెతకాలో ముందుగానే తెలిసిపోతుంది కాబట్టి అనవసరమైన అంశాలను పక్కనపెడుతూ మనకి కావలిసిన విషయం కోసం వెతుకుతూ చకచకా ముందుకెళ్ళవచ్చు. అలాగని ప్రశ్నతో పాటు నాలుగు Options కూడా చదవమని కాదు. కేవలం ప్రశ్నని చదివితే సరిపోతుంది. ముఖ్యంగా చాలా పెద్దగా ఉండే Passage విషయంలో ఇది బాగా work out అవుతుంది.
Easy level RC విషయంలో, ప్రశ్నలోని ఓ keyword ని పట్టుకొని దానిని text లో వెతుకుతూ వెళ్తే సులభంగా జవాబు దొరుకుతుంది.
అయితే అందరూ వెళ్ళే పద్దతిలో వెళ్ళాలా లేక దానికి భిన్నంగా ముందుకు సాగాలో నిర్ణయించుకోవాల్సింది మీరే. దీనికోసం ముందుగా కొన్ని Passageలు ప్రాక్టీసు చేసి, ఆ తరువాత ఏది మీకు సరిపోతుందో మీరే ఎంచుకోవచ్చు.
16. Timer సాయంతో ప్రాక్టీసు చేయడం అవసరం.
దీనివల్ల ఒక్కో Section కి ఎంత సమయం కేటాయించవచ్చో మీకు తెలుస్తుంది. ముఖ్యంగా RC లలో ఓ ప్రశ్నకి X సమయం కేటాయించుకున్న తరువాత, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆప్రశ్నపై అంతకు మించి సమయాన్ని వృధా చేయకూడదు. చప్పున ఆ ప్రశ్నను వొదిలేసి next ప్రశ్నకి వెళ్లిపోవాలి. ఓ ప్రశ్న మీకు అర్థం కానపుడు ఆ విషయాన్ని అంగీకరించి ఆ ప్రశ్నను వదిలిపెట్టేయ్యాలి. అంతేతప్ప“నాకు అర్థం కాకపోవడమా…Never”అంటూ Ego సమస్యగా తీసుకుంటే నష్టపోయేది మీరే.
ఏ ప్రశ్నని ప్రయత్నించాలి, దేనిని వదిలిపెట్టాలి అన్న దాంట్లోనే మీ వివేకం బయటపడుతుంది.
17. News papers చదవండి:
మీకు ఇంగ్లీషు పత్రికలూ చదివే అలవాటు ఉంటే మీకు ఈ విభాగం మరింత సులభమవుతుంది. ముఖ్యంగా బ్యాంకు పరీక్షల అభ్యర్థులకి ఇది ఎంతో అవసరం. కానీ ఈ సూచనని చాలామంది అభ్యర్థులు సీరియస్ గా తీసుకోవడం లేదు. పత్రికలంటే ఆసాంతం పూర్తిగాచదవాల్సిన అవసరం కూడా లేదు. Hindu, Economic Times, Business Line లాంటి పత్రికల కనీసంఎడిటోరియల్ చదివినా సరిపోతుంది. దీనికోసం మీరు కేటాయించాల్సిన సమయం రోజూ ఇరవై నిముషాలు మాత్రమే. Textను చదవడం అలవాటుగా మారి పరీక్షలో ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.
18. గత ప్రశ్న పత్రాలను solve చేయండి.
గత ప్రశ్న పత్రాలను solve చేయడం ద్వారా
  • ప్రశ్నలు ఏవిధంగా రూపొందించబడుతున్నాయి
  • వాటి Difficulty స్థాయి ఏమిటి
  • ఏ రకమైన ప్రశ్నలను ఊహించవచ్చు
  • ఎలాంటి ప్రశ్నను వదిలిపెట్టాలి
అనే వాటిపై మంచి అవగాహన కలుగుతుంది.
19. ఆందోళన వద్దు.
ఎంత కష్టపడి చదివినా మీకు తెలియని ఏదో ఒక word, Passage లో కనిపించవచ్చు. దాని గురించి ఆదుర్దా పడకండి.
ఇంగ్లీషులో 20 volume లు గల Oxford English dictionary లో 171, 000 words ఉన్నాయి. వీటిలో సగానికి పైగా Nouns, పావువంతు Adjectives ఉన్నాయి. ఇందులో భారీ సంఖ్యలో Obsolete words (ప్రస్తుతం వాడుకలో లేనివి Ex: thy, thou) ఉన్నాయి కూడా.
సగటున ఓ వ్యక్తి ఇంగ్లీషుని అర్థం చేసుకోవాలంటే కనీసం 4000 పదాలను తెలుసుకొని ఉంటే సరిపోతుంది. అలాగే బ్యాంకింగ్ పరీక్షలకి సిద్దమవుతున్న అభ్యర్థి కనీసం 7000 words ను తెలుసుకొని ఉండడం శ్రేయస్కరం.
అయితే ఎన్ని కొత్తపదాలు నేర్చుకున్నాగానీ, మీరు చదవని కొత్తపదం పరీక్షలో కనిపిస్తే గనక మీరు చేయగలిగిందేమీలేదు. దీనికి మీరేకాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలాగేఓ స్థాయికి మించి Vocabulary పెంచుకోవడం సాధ్యం కాదు కూడా.
అందువల్ల, అనవసరమైన ఆందోళనను దరిజేయనీయకండి.
English Grammar in Telugu: Reading Comprehension పై పట్టు సాధించడానికి 42 Tips.
20. స్కిమ్మింగ్ (Skimming):
Text లోని సూక్ష్మమైన విషయాల జోలికి పోకుండా, వేగంగా చదువుతూ, అసలు text యొక్క main themeని గుర్తించే ప్రక్రియను స్కిమ్మింగ్ అంటాము. దీనివల్ల రచయిత ‘దేనిగురించి చెప్పదలచాడు’ అన్నదానిపై ఓ స్పష్టత ఏర్పడుతుంది.
21. Option Elimination:
ఇవ్వబడ్డనాలుగు Options లలో సరైనదానిని గుర్తించలేకపోయినపుడు కనీసం ఖచ్చితమైన జవాబులు కాని వాటిని తొలగించడం ద్వారా కొంత స్పష్టత రావొచ్చు.
22. ప్రశ్నలో ‘text లోని ఓ వాక్యం’ గురించిన ప్రస్తావన ఉంటే, ఆ వాక్యాన్ని రెండుసార్లు చదవండి. మరీ ముఖ్యంగా ఆ వాక్యానికి ముందూ వెనకా వాక్యాలు కూడా చదవడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. ‘ప్రశ్నలో చెప్పిన వాక్యం మాత్రమే చదువుతాను’ అనుకుంటే కొన్నిసార్లు ఇబ్బంది ఎదురుకావోచ్చు.
23. Patternని గుర్తించడం ద్వారా కూడా కొన్నిసార్లు జవాబులు గుర్తించవచ్చు.
ఉదాహరణకి ఓ Passage లో ‘Malevolent’ అనే పదానికి Opposite word ఏమిటి అని అడిగినపుడు జవాబుల్లో ఉన్న Benevolent అన్నదానిని గుర్తించవచ్చు. ఈ రెండూ ఓ pattern లో ఉన్నాయని మనం గ్రహించవచ్చు.
Malevolent X Benevolent
24. Synonyms, Antonyms విషయంలో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది.
ఒక word కి ఒకటి కన్నా ఎక్కువ అర్థాలున్నప్పుడు Context (సందర్భం) ను గ్రహించాలి. సందర్భాన్ని బట్టి ఆ word కి meaning మారుతూ ఉండవచ్చు. “నేను చదివిన పుస్తకంలో ఈ word అర్థం ఇలాగేఉంది” అనుకుంటే మీరే నష్టపోతారు. కాబట్టి నేర్చుకునేప్పుడే ఏ సందర్భంలో ఓ word meaning ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.
25. మీ సొంత అభిప్రాయాలను జోడించకండి.
ఉదాహరణకి Demonetization పై ఓ RC వచ్చిందనుకోండి. ఓ రెండు లైన్లు చదివి “ఓస్ దీని గురించా..నాకు దీనిపై సంపూర్ణమైన అవగాహన ఉంది” అనుకోని చదవడం మానేయవద్దు. మీకు ఆ టాపిక్ గురించి ఇదివరకే తెలిసి ఉన్నా కూడా అందులో ఉన్న అభిప్రాయాలు పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. ప్రశ్నలకి రాయాల్సిన జవాబులు Text నుండే తీసుకోవాలి తప్ప మీ సొంత knowledge నుండి కాదు. ఈ విషయం మరిచిపోవద్దు.
26. Negative marking లేనపుడు, ఏ ప్రశ్నను కూడా వదిలిపెట్టవద్దు.
Negative మార్కులు ఉన్నప్పుడు మాత్రం సందేహాస్పదంగా ఉన్న ప్రశ్నలకి జవాబులు రాయాలో వద్దో మీరే నిర్ణయం తీసుకోవాలి, అది కూడా ఎక్కువ సమయం వృధా చేయకుండా. ఉదాహరణకి IBPS లో ప్రతీ తప్పుడు సమాధానానికి 0.25 (1/4) మార్కు మైనస్ అవుతుంది.
27. తెలిసి తెలిసి తప్పు చేయకండి.
చాలామంది అభ్యర్థులు సమాధానం తెలిసి ఉండి కూడా తప్పుగా గుర్తించి ఇంటికొచ్చి బాధపడటం నేను చూసాను. దీనికి కారణం తొందరపాటు. ‘ఇంత Easy ప్రశ్న అడిగారే’ అన్న సంతోషంలో, సరిగ్గా అర్థం చేసుకోకుండా తప్పు చేసే అవకాశముంది. నాకు తెలిసి ప్రతీ అభ్యర్థి ఇలా 1-2 ప్రశ్నలకి మార్కులు కోల్పోయే chance ఉంది. ప్రతీ మార్కూ ఎంతో విలువ కలిగిన ఈ పరీక్షల్లో ప్రతీ ఒక్క మార్కు కూడా మీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది.ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి.
28. ఓ ప్రశ్న గురించి ఎక్కువసేపు ఆలోచిస్తే ప్రతీ Option సరైనదిగా అనిపించే అవకాశముంది.
ఇది ఒక భ్రమ. అందుకే ప్రతీ ప్రశ్న మొదటిసారి చదవగానే మీకు ఏది సరైన సమాధానంగా అనిపిస్తుందో దానిని పెన్సిల్ తో చిన్నగా మార్క్ చేయండి(పెన్ను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధం కావొచ్చు). అలాగే పెన్సిల్ని పాయింటర్ లా ఉపయోగిస్తూ చదువుకుంటూ వెళ్ళడం ద్వారా కొంత మటుకు మీ ఏకాగ్రత పక్కకి మళ్ళకుండా కూడా ఉంటుంది. ఆ ప్రశ్నకి సమాధానం ఎటూ తేలనపుడు మొదటిసారి మీకు అనిపించిన జవాబుని గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. ఈ సౌలభ్యం online టెస్టులలో ఉండదు.
29. కొన్నిసార్లు సరైన సమాధానంలో ఉపయోగించే words, text లో ఇవ్వబడిన words కంటే భిన్నంగా ఉంటూ అదే అర్థాన్నిచ్చేవిగా ఉండవచ్చు. అందువల్ల words ఒకేవిధంగా లేవని చెప్పి ఆ Option ని కొట్టిపారేయకుండా అర్థాన్ని లెక్కలోకి తీసుకోవడం ఎంతో అవసరం. కేవలం ప్రశ్నలో ఇవ్వబడ్డ words ని text లో వెతుక్కుంటూ వెళ్లేవారికి ఇది ఇబ్బందికరమే.
30. Text లో కొన్ని actions జరిగినపుడు వాటి Sequence (క్రమము) గుర్తుపెట్టుకోవడం కూడా అవసరం. ఏది ముందు జరిగింది, దాని తరువాత ఏం జరిగింది అన్న దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. దీనికోసం ఈ క్రింది పదాలను అర్థం చేసుకోవడంతో పాటు text లో వచ్చినపుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
First, Then, Next, Finally, Before, Last…….
31. Passageని బిగ్గరగా చదవడం చాలా మేలు చేస్తుంది.
దురదృష్టవశాత్తూ Exam హాల్ లో ఇలాచేయడం వీలు కాదు. అయితే ఇంట్లో ప్రాక్టీసు చేసేటపుడు మాత్రం ఉపయోగించుకోవచ్చు. గట్టిగా బయటకి చదవడం వల్ల మీ ఏకాగ్రత దెబ్బతినకుండా passage పైనే ఉంటుంది.మీ నోరు, చెవులు, Mind ఈ మూడు సమన్వయంతో పనిచేసి text ని పూర్తిగా అర్థం చేసుకోడానికి దోహదం చేస్తాయి.అలాగే pronuncition లాంటి Oral skills కూడా మెరుగుపడతాయి.
32. Passage ని చదివేటపుడు ఒక్కో పదాన్ని విడివిడిగా చదవడం చేయకూడదు. దీనివల్ల సమయం వృధా అవడంతో పాటు మీకు అర్థం చేసుకోడానికి కూడా చాలా సమయం పడుతుంది. దీని బదులు కొన్ని words ని గ్రూపుగా చేసి ఆ chunks ని చదవడం ప్రాక్టీసు చేయాలి.
33. Inference : ఈ రకమైన ప్రశ్నలు క్లిష్టమైనవి. కానీప్రస్తుత ట్రెండులో ఎక్కువగా inference రకం ప్రశ్నలే అడగటం జరుగుతున్నది. ఈ ప్రశ్నలకు సమాధానం నేరుగా passage లో లభించదు, కానీ passage లో అంతర్లీనంగా ఎక్కడో ఉంటుంది. దీనినే ‘reading between the lines’ అంటారు. అంటే అభ్యర్థి ఆ విషయాన్ని గుర్తించి అర్థంచేసుకొని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్నలకి సమాధానాలు వెతకడానికి మాత్రమే అలవాటు పడ్డవారికి ఇది మింగుడుపడని విషయమే.
34. ఈ క్రింది పదాలు Passage లలో తరచూ కనిపిస్తూ ఉంటాయి.
Contrast words: (భేదాన్ని తెలపడానికి)
Although, however, differ, unlike, even though, yet, but, instead, on the other hand, whereas, while, despite, in contrast to, although, rather, as opposed to, nevertheless,
Conclusion words:(ముగింపుని తెలపడానికి)
therefore, consequently, so, hence, it can be inferred that, implies that, proves that, given these points, to sum up, altogether, finally, lastly, all in all, taking everything into account, on the whole, to put it in a nut shell, in closing, in brief,
Words that compare:(పోల్చడానికి)
As well as, too, similarly, in the same way, like, some, both, in common, as well, also.
35. ఈరకమైన ప్రశ్నలు passage లలో తరచూ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పద్దతిలో తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని ఊహించవచ్చు.
Types of questions that appear in RC regularly.
  • What are the author’s views in the passage?
  • According to the passage which of the following statements are true?
  • Which of the following statements are not true?
  • Which of the following words can best replace the word “…..”?
  • The phrase “…….” In the passage refers to?
A……………….
B……………
  1. Only A                                      B)only B
  2. Both A and B                             D)neither A nor B
  3. Which of the following statements is true in the context of the passage?
  4. Choose the words which is most opposite in meaning of the word “……………..”as used in the passage?
  5. “……………” (phrase from passage) means…?
  6. The tone of the passage is……………………..
  7. The main idea of the passage is…………….
  8. The most appropriate title for the passage will be…………..
  9. All the following are true except that
36. Passage లోని ప్రతీ ఒక్క wordని, వాక్యాన్ని అర్థం చేసుకుంటే మంచిది. అలాగని ఓ చోట,“అర్థం కాలేదన్న” కారణంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదు. చాలా సందర్భాల్లో కాంటెక్స్ట్ (సందర్భం)ని బట్టి word యొక్క అర్థాన్ని ఊహించడం సాధ్యమే. కాబట్టి ‘పూర్తిగా అర్థమవడం తప్పనిసరి’ అన్న భ్రమలోంచి బయటపడండి.
37. Passage లోని keywords(ముఖ్యమైన పదాలు) ని చకచకా గ్రహించగలగాలి. ఈ keywords ని జోడించడానికి అనేక ఇతర words కూడా ఉంటాయి. అయితేఇవి అంత ప్రధానమైనవి కావు. ఈ words ని తొలగించినా Passage యొక్క అర్థం ఏమీ మారదు. ఇలా ఏ phrase ముఖ్యమైనదో ఏది కాదో గుర్తించడంలోనే అభ్యర్థి తెలివి బయటపడుతుంది. దీనిలో ప్రావీణ్యం సంపాదించాలంటే వీలైనన్ని ఎక్కువ passage లు ఇంటివద్ద ప్రాక్టీసు చేస్తూ నేర్చుకోవాలి.
38. “నాకు అన్ని సమాధానాలు తెలుసు. కానీ రాయడానికి సమయం సరిపోలేదు” అన్న వేదన మరీ బాధాకరమైనది. తెలిసిఉండీ రాయలేకపోవడం. Time management అలవర్చుకోవడం, పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
English Grammar in Telugu: Reading Comprehension పై పట్టు సాధించడానికి 42 Tips.
39. వదిలిపెట్టి మళ్ళీ తిరిగిరండి:
కొన్నిసార్లు మొదటి రౌండులో మీకు సమాధానం దొరక్కపోవచ్చు. సమాధానం మీ కళ్ళముందే ఉన్నాకూడా మీరు గుర్తించలేక పోవచ్చు. అలాంటప్పుడు వచ్చిన వాటికి చకచకా జవాబులు రాస్తూ రానివాటి కోసం ఆ తరువాతతిరిగి రావడం మంచిది. ఎందుకైనా మంచిది, ఆ క్షణంలో మీకేది సరైనదిగా అనిపిస్తే దానికి పెన్సిల్ తో చిన్నగా మార్క్ చేసుకోవడం మరువవద్దు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు చేయాల్సి వచ్చే పరీక్షల్లో మాత్రం ఇలా వెనక్కి తిరిగి రావడం సాధ్యం కాకపోవచ్చు.
40. చదివే వేగాన్ని పెంచుకోవడం ద్వారా కొంత సమయాన్ని ఆదా చేయవచ్చు.
41. ధైర్యాన్ని కోల్పోవద్దు:
చాలాసార్లు ఇది జరగవచ్చు. ఒక్కసారి Passage ని చూసి గాభరా చెంది ‘నా పని అయిపోయింది’ అని అనుకునేవాళ్ళు కూడా ఉంటారు.  మీరలా ఆందోళన చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ‘నాకు కష్టంగా అనిపిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా కష్టంగానే ఉంటుంది’ అని అనుకోని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అలాకాక panic అయితే మరిన్ని తప్పులు చేస్తారు.
42. రెండు రకాల స్థాయిల Passage ల ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.
Easy level:  (IBPS clerk examination)  
Directions (6-15) : Read the following passage carefully and answer the questions given below it. Certain words / phrases have been given in bold to help you locate them while answering some of the questions.

There once lived an old man. He had three sons. One day, the old man called his three sons and said ‘My end is near! I wish to give you certain things that I have kept for you’. He then gave a rooster to his eldest son, an axe to the second and a cat to the youngest. ‘These things may seem worthless but everything depends on how sensibly you use them’, said the old man.

In a few days, the old man died. His sons decided to make their fortune using the gifts, they received from their father. So, the eldest son went wandering about with his rooster. He crossed many towns and cities until he reached an island where people didn’t know how to divide their time. ‘Perhaps this should be the right place to use my rooster’, he thought. So he called out to the people and said, ‘Look!Here is an amazing creature; it has a ruby- red crown upon its head like a knight. It crows fourtimes during the night and when it crows for the last time, the sun soon rises. But, if it crows inbroad daylight, then be careful, there will certainly be a change in weather’. The people ofthe island were amazed to see such a creature.

‘Is this creature up for sale?’‚ they asked. ‘O yes! And the price is as many gold coins as a donkeycan carry’, he replied. ‘Oh that’s just a small price for such a precious and useful creaturewho will help in keeping track of time’, they replied and willingly gave him the gold coins.When the eldest son came home with his wealth, the other two were astonished. Now the second son went wandering about with his axe.

He crossed many farms where labourers were carrying their own axes. At last, he chanced upon an island where people knew nothing about axes. So, he began displaying his axe and started narrating its uses. People were amazed to see such a tool and agreed to buy it for a horse laden with as much gold as it could carry.

Now it was the third son’s turn to see what he could get of his cat. He went about wandering
through many towns until he reached a place where mice had created a menace and no cat had ever been seen. ‘We are fed up of the mice. They are so many that they dance upon our tables and benches and gnaw whatever they catch hold of’, they complained. The youngest son let his cat free for some time. Shebegan her chase and soon cleared some houses.

People were extremely happy to see this. They begged the king to buy the wonderful creature for their kingdom. The king readily agreed and bought it for a mule laden with gold. The youngest son happily returned home. Thus, the three sons made the best out of their father’s gifts and lived in wealth and prosperity.

6. Which of the following can be an appropriate title for the story?
1) Bring Out the Devil in You
2) The Rooster and its Crow
3) The Mantra to be Successful-Own a Cat or a Rooster
4) Make the Best of What You Have
5) The Scheming Father

7. Which of the following statements is true in the context of the story?
1) The king was reluctant to purchase the cat from the youngest son.
2) All three brothers married the king’s daughters in the end.
3) The ailing father had secretly informed the eldest son about making money from his rooster.
4) The youngest son was too lazy to work; as a result he went last on his quest for wealth.
5) None of the given statements is true

8. Choose the following which is most nearly the opposite in meaning as the word ‘RIGHT’ as used in the story?
1) dishonest 2) bad luck 3) unfitted4) true 5) left

9. Which of the following correctly explains the meaning of the phrase, ‘CHANCED UPON’ as used in the story?
1) Divided 2) Went with the flow3) Waited for something 4) Failed to find
5) Came across

10. Which of the following is most nearly the same in meaning as the word ‘BEGGED’ as used in the story?
1) pleaded with 2) sued 3) donated4) granted 5) ordered for

11. As mentioned in the story, people of the island bought the rooster because
A) they genuinely wished to help the eldest son in becoming a merchant.
B) it would help them manage their time more effectively.
C) they were amused by its features and wanted it as a pet.
1) Only (B) 2) Both (A) and (B)
3) Only (A) 4) Only (C)
5) Both (A) and (C)

12. Which of the following is most nearly the opposite in meaning as the word ‘CERTAINLY’
as used in the story?
1) positively 2) cautiously 3) probably4) blindly 5) eccentrically

13. Which of the following characteristics of the father comes across distinctly through the story?
1) He was aggressive 2) He was lonely
3) He rarely became angry 4) He was wise
5) He was an animal lover

14. Which of the following is most nearly the same in meaning as the word ‘WORTHLESS’ as used in the story?
1) barren 2) significant 3) useless4) abolished 5) adopted

15. As mentioned in the story, the father gave gifts to his sons because
1) he didn’t want them to fight in his absence.
2) they had demanded those gifts from him.
3) those were the only gifts he could afford at that time.
4) he was trying to take revenge on them by giving gifts which were of no use.
5) Other than those given as options
Difficult level:(IBPS PO 2015)
Directions (6-15): Read the following passage carefully and answer the given questions. Certain words/phrases have been given in bold to help you locate them while answering some of the questions.
Manufactures of Consumer Packaged goods (CPGs) face two key challenges this year. The first continued slow or negative growth in people’s disposable incomes. The second is changing consumer attitudes toward products and brands, as the great fragmentation of consumer markets take another turn. In response, companies must dramatically shift the route they take to reach consumers in terms of both product distribution and communications. In many markets, consumer wages have been static for five years now. Even where economies are starting to perform better, the squeeze on after-tax wages, especially for the middle class younger people and families, is depressing consumer spending. Although growth in developing countries is still better than in the United States and Europe, a slowdown in emerging countries such as China-where many countries had hoped for higher sales-has translated quickly into lower-than expected consumer spending growth.
Meanwhile, what we call the great fragmentation is manifested in consumer behavior and market response. In both developed and emerging markets, there is a wider variety among consumers now than at any time in the recent past. Growth is evident both at the top of the market (where more consumers are spending for higher-quality food and other packaged goods) and at the lower end (where an increasing number of consumers are concentrating on value). But the traditional middle of the market is shrinking.
Further, individual consumer behavior is more pluralistic. We are used to seeing, for example, spirits buyers purchasing a premium band in bar, a less costly label at home for personal consumption and yet another when entertaining guest. But, this type of variegated shopping has now spread to the grocery basket as well. Fewer consumer are making one big stocking up trip each week instead shoppers are visiting a premium store and a discounter as well as a supermarket, in multiple weekly stops – in addition to making frequent purchases online. During recession, more shoppers became inclined to spend time hunting for bargains and as some traditional retailers either went out of business or shuttered down, retail space was freed up and was often filled by convenience stores, specialty shops, and discounters.
A decade ago, CPG companies had only ‘a handful of’ sales channels to consider supermarkets, convenience stores, hypermarkets in advanced economies and traditional small and large retailers in emerging countries. Since, then various discounters have made significant inroads, including no frills, low variety outlets, such as Europe’s Aldi and Lidl, which sell a limited range of private lable grocery items in smaller stores and massive warehouse clubs, such as Costco and Sam’s club, which initially operated solely in the USA but are now expanding internationally. In addition, dollars stores, specialized retailers, and online merchants are having an impact on the CPG landscape. Economizing consumers have been pleasantly, surprised by the savings generated by spreading their business among multiple channels, as well as by the variety and product quality they find. The result has been greater demand for more product and brands, with different sizes, packaging and sales methods. At most CPG companies, SKUs are proliferating despite there being little increase in overall consumption. A better outcome can be seen at smaller food and beverage suppliers, which are benefitting from consumer demand for variety and authenticity. A recent report found that in the USA, small manufacturers (with revenues of less than $1 billion) grew at twice the compound annual rate of large manufacturers (with revenues of less than $3 billion) between 2009 and 2012.
Consumers media usage has also fragmented with the rise of digital content and the proliferation of online devices. Each channel – from the web, mobile and social sites for radio, TV, and print – has its own requirements, audience appeal and economics, needing specialized attention. But, at the same time, media campaigns need to be closely coordinated for effective consumer messaging.
Collectively, these shifts challenges the sway CPS companies manage their brand and business portfolios and call for a rethinking of their go-to-market approach, with an emphasis on analytics. Our work with INSEAD shows that among business leaders, applying analytics–especially for tracking consumer behavior and product and promotional performance–considered one of the most effective ways to improve results and outpace the competition. But it’s not just about insight. It’s also about using the insight wisely to determine how to manage costs. The more knowledgeable about customer needs and preferences a company is, the smarter and more focused it must be in managing its own economics to cost-effectively deliver both variety and value to be squeezed consumer.
6. The central theme of the given passage is
(1) The Shrinking Market
(2) Shift towards offering Luxury Goods to Consumers
(3) Products to offer consumers with squeezed packets
(4) To highlight products consumer by the middle class
(5) Gaining insight into changing consumer behavior towards CPGs
7. In the context of the passage, which of the following brands existed otherwise but is now being manifested in buying groceries as well?
(1) Consumer purchasing the same products for over a period of time.
(2) Consumer willing to purchase goods for a longer period of time.
(3) Consumers preferring luxury goods over regular goods.
(4) Consumers are more aware of their rights.
(5) Consumers prefer buying goods from a variety of stores.
8. Which of the following is most nearly the opposite in meaning to the word Depressing as used in the passage?
(1) Encouraging (2) Sunny (3) Doubtful  (4) Light (5) Nil
9. As mentioned in the passage, CPG companies may have to reassess their present strategies of operating to
(A) retain their customers
(B) keep pace with changing consumer preference as they have access to multiple media channels
(C) make more cost-effective decisions.
(1) Only A (2) B and C (3) All of these (4) Only C (5) A and B
10. Which of the following is most nearly the opposite in meaning to the word Depressing as used in the passage?
(1) Encouraging (2) Sunny (3) Doubtful  (4) Light (5) Nil
11. Which of the following is true in the context of the passage?
(1) In the USA, during the three year period after 2009, small manufacturing did not fare well as compared to their larger counterparts.
(2) Impact on dispensable incomes of people barely affects the CPG manufacturing industry.
(3) Post-tax wages, especially for the middle class, are one of the critical factors which have reduced spending behavior of consumers.
(4) The CPG have always been a favourite among consumers.
(5) None of the given options is true.
12. As mentioned in the passage, one of the most critical factors that aids in creating to the needs of consumers, is
(1) persuading them to purchase goods produced by the organization
(2) assess their requirements and appropriately plan to meet them
(3) offering them products that an organization regularly manufactures.
(4) concentrating only on being aware about changing presences of consumers
(5) None of the above
13. Which of the following is most nearly the same in meaning to the word above Shrinking as used in the passage?
(1) Developing (2) Annoying  (3) Narrowing (4) Wasting (5) Rising
14. Which of the following is most nearly the same in meaning of the word Variegated as used in the passage?
(1) Diverse  (2) Composite (3) Strong  (4) Narrow (5) Valued
15. Which of the following is most nearly the opposite in meaning to the word Shuttered as used in the passage?
(1) Closed (2) Retail (3) Flourished (4) Gratified (5) Nearest

Popular Posts