విజయ నిర్మ‌ల భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మహేష్

విజయ నిర్మ‌ల భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మహేష్

ొద్ది రోజులుగా కాంటినెంట‌ల్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ బుధ‌వార రాత్రి విజ‌య నిర్మల‌ తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. 

కొద్ది సేప‌టి క్రితం విజ‌య నిర్మ‌ల భౌతిక కాయాన్ని నాన‌క రామ‌గూడ‌లోని ఆమె ఇంటికి తీసుకొచ్చారు. 

అభిమానుల సందర్శ‌నార్దం ఈ రోజు అక్క‌డే ఉంచ‌నున్నారు. 

రేపు మ‌హా ప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్నారు. కొద్ది సేప‌టి క్రితం ఇంటికి చేరిన విజ‌య నిర్మ‌ల పార్ధివ దేహాన్ని చూసి కృష్ణ‌, న‌రేష్ క‌న్నీరు మున్నీరుగా విలపించారు. 

మ‌హేష్‌, న‌మ్ర‌త‌, జ‌య‌సుధ‌,బాల సుబ్ర‌హ్మాణ్యం, మ‌ర‌ళీ మోహ‌న్ తో పాటు త‌దిత‌ర ప్ర‌ముఖులు విజ‌య నిర్మ‌ల పార్ధివ దేహంపై పూల‌మాల‌లు ఉంచి నివాళులు అర్పించారు.

Comments