సరికొత్త ఫీచర్ తో గూగుల్ 'డుయో




 సరికొత్త ఫీచర్ తో  గూగుల్ 'డుయో





టెక్ దిగ్గజం గూగుల్ తన వీడియో కాలింగ్ యాప్ 'డుయో'లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ దీని ద్వారా గరిష్ఠంగా నలుగురితో మాత్రమే గ్రూప్‌ వీడియో కాలింగ్ చేసుకొనే వెసులుబాటు ఉండేది. ఇకపై ఒకేసారి 8 మందితో వీడియో చాట్ చేసే ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని గూగుల్‌ డుయో తన అధికారిక బ్లాగ్‌లో ప్రకటించింది.

గతనెల ఏప్రిల్‌లోనే గూగుల్ 'డుయో'లో 'వీడియో కాలింగ్' ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన నెలలోపే వీడియో కాలింగ్ పరిధిని పెంచడం విశేషం. ఈ సదుపాయం ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు తక్షణమే అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది.

కొత్త ఫీచర్‌లో భాగంగా వీడియో కాల్స్‌ చేసేటప్పుడు డేటాను ఆదా చేయడం కోసం 'డేటా సేవింగ్‌ మోడ్‌'ను ప్రవేశపెట్టింది. వీడియోకాల్‌లో ఉన్నప్పుడు టెక్ట్స్‌, ఎమోజీ లేదా డూడుల్‌ను పంపించే వెసులుబాటును కల్పించింది. 'డుయో'లో డార్క్‌మోడ్ ఫీచర్‌ను కూడా గూగుల్ తేనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. అతి త్వరలోయే యూజర్లకు అందుబాటులోకి రానుంది. 

Comments

Popular Posts